గత రాత్రి బిగ్ బాస్ కెప్టెన్ గా శ్రీరామ్ చంద్ర నిలవగా చాలామంది హౌస్ మేట్స్ సన్నీ ని విలన్ గా చూపించి కడుపులో కత్తి దింపారు. ఆ మోసం నుండి సన్నీ చాలా సేపు బయటికి రాలేక కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఇక ఈ రోజు వరెస్ట్ పెరఫార్మెర్ ఎవరో అనే విషయంలోనూ బిగ్ బాస్ హౌస్ లో పెద్ద యుద్ధమే మొదలయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ లో లోబో, ప్రియాంకలు ఖుషి స్కిట్ చేసారు. శ్రీరామ్ చంద్ర పాటకి ప్రియాంక హొయలు పోయింది. ఇక నడుం చుట్టూ రింగ్ తిప్పే ప్రాసెస్ లో ప్రియా తిప్పలేక ఉండిపోయింది. ఇక యాంకర్ రవి రింగ్ ని కొద్దీ సేపు తిప్పగలిగాడు. దానితో హౌస్ మేట్స్ అతన్ని ఒక్కరిగా హాగ్ చేసుకున్నారు.
అయితే నటరాజ్ మాస్టర్.. రవి ఆ రింగ్ తిప్పుతున్నంత సేపు నీళ్లలో నత్త ఒకటి ఉంటుంది కదా రొండు కొమ్ములు ఉంటాయి అంటూ యని మాస్టర్ వాళ్ళదగ్గర రవి గురించి మాట్లాడాడు. మరి రవి అది విన్నాడో.. లేదో.. కానీ.. నటరాజ్ మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు.. నీకెందుకు రా నా గురించి అంటూ రవి కాస్త కోపం గా ఉన్నాడు. అంటే దాదాపుగా నటరాజ్ కి యాంకర్ రవికి మధ్యన ఏదో కోల్డ్ వార్ జరుగుతుంది అనిపిస్తుంది. మరోపక్క వరెస్ట్ పెరఫార్మెర్ గా కాజల్ ని అనుకుంటుంది శ్వేతా. శ్వేతా కి కాజల్ కి గొడవ జరిగింది. కాజల్ శ్వేతా తో ఇది నా గేమ్ స్ట్రాటజీ అంటూ డైలాగ్ వేసింది. మరి ఈ రోజు ఎపిసోడ్ గరం గరం గానే కనిపిస్తుంది.