ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్ తో మొదలైన సలార్ పాన్ ఇండియా మూవీ సెకండ్ షెడ్యూల్ లో రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ సలార్ షూట్ ని పక్కనబెట్టి ప్రస్తుతం ఆదిపురుష్ షూట్ లో పాల్గొనడానికి ముంబై వెళ్ళాడు. ప్రభాస్ తో ఫస్ట్ టైం సలార్ మూవీ లో జోడి కడుతున్న శృతి హాసన్.. సలార్ చిత్రీకరణలో పాల్గొన్నప్పుడల్లా బాగా ఎగ్జైట్ అవుతుంది. ఈమధ్యనే ప్రశాంత్ నీల్ ని సలార్ సెట్స్ లో ఆటపట్టించిన శృతి హాసన్.. మరోసారి సలార్ విషయాలను షేర్ చేసింది. గతంలో కాటమరాయుడు కి ముందు శృతి హాసన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉన్నా.. కాటమరాయుడు తర్వాత వరస ప్లాప్స్, వ్యక్తిగతంగా శృతి హాసన్ ఇబ్బందుల్లో ఉండి కెరీర్ ని పక్కనబెట్టేసింది.
అయితే శృతి హాసన్ ఓ నియమం పెట్టుకుంది. అదేమిటంటే.. సాధారణంగా శృతి హాసన్ హీరోయిన్ అయ్యాక ఏడాదికి ఒక భాషలో ఒక సినిమా చేయాలనే నియమం పెట్టుకుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏడాదికి ఒక్కో సినిమా చెయ్యడం వలన కథలపై, అలాగే పాత్రలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఏడాదికి మూడు సినిమాలు చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది అని చెబుతుంది. కాకపోతే ఒక్కోసారి తన నియమాన్ని పక్కనపెట్టేయాల్సి వస్తుందట. అందుకే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం సలార్ కోసం తన నియమాన్ని పక్కనబెట్టేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఎలాగూ అన్ని భాషల్లో వరస సినిమాలు చెయ్యాలనుకున్న నాకు సలార్ అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది కనక సలార్ అలా కలిసొచ్చింది అని చెప్పుకొచ్చింది శృతి హాసన్.