Advertisementt

బిగ్ బాస్ 5: శ్రీరామ్ కెప్టెన్.. సన్నీని మాత్రం

Fri 01st Oct 2021 10:24 AM
bigg boss 5,bigg boss 5 telugu,bigg boss 5 update  బిగ్ బాస్ 5: శ్రీరామ్ కెప్టెన్.. సన్నీని మాత్రం
Bigg Boss 5: Yesterday Episode Highlights బిగ్ బాస్ 5: శ్రీరామ్ కెప్టెన్.. సన్నీని మాత్రం
Advertisement
Ads by CJ

గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అంత రసవత్తరంగా అని చెప్పలేం కానీ.. ఓకె ఓకె గా సాగింది. ఎక్కువగా బరువు కోల్పోయిన జంటల్లో ముగ్గురు కెప్టెన్ కోసం పోటీ చెయ్యగా.. అందులో శ్రీరామ చంద్ర, సన్నీ, శ్వేతా లు ఉన్నారు. వారు ముగ్గురు ప్రతి కంటెస్టెంట్ దగ్గరకి వెళ్లి నాకు ఓటు వెయ్యమని అడిగారు. కాజల్ అయితే సన్నీ కి ఓట్ వెయ్యను అని చెప్పేసింది. తర్వాత శ్రీరామ చంద్ర, శ్వేతకి అనుకూలంగా సన్నీ కి వ్యతిరేఖంగా హౌస్ మేట్స్ చాలామంది సన్నీ ని కత్తితో పొడిచి నువ్వు కెప్టెన్ గా పనికి రావన్నారు. సిరి నీ ఫేక్ స్మైల్ నచ్చలేదు అంటే.. లోబో నీకు ఇంకా కెప్టెన్ అయ్యే వయసు లేదు అని, విశ్వ నీ యాటిట్యూడ్ నచ్చలేదు అన్నాడు. ఇక ప్రియా సన్నీ నువ్ నాతో కనెక్ట్ అవ్వలేదు అని సన్నీని కత్తితో పొడిచారు.

శ్వేతా కెప్టెన్ అవుతుంది అనుకున్న టైం లో కాజల్ అండ్ మానస్ లు అనూహ్యంగా శ్వేతా ని కత్తితో పొడవడంతో శ్రీరామ చంద్ర కెప్టెన్ అయ్యాడు. కానీ సన్నీ నేను వాష్ బేసిన్ దగ్గర కోపం గా ఉన్నా అని, నాది ఫేక్ స్మైల్ అని నన్ను కెప్టెన్ అవ్వనివ్వలేదు.. అదీ ఒక రీజనా.. అసలు ఇదేమన్నా నామినేషనా.. అలా నన్ను చేసారు అంటూ సన్నీ బాగా ఫీలయ్యాడు. మరో హాఫ్ అఫ్ ద హౌస్ మొత్తం సన్నీ ని కెప్టెన్ అవ్వనివ్వలేదు. దానితో సన్నీ బాగా హార్ట్ అయ్యాడు. 

Bigg Boss 5: Yesterday Episode Highlights :

Bigg Boss 5 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ