Advertisementt

హీరో నాని న్యూ అవతార్

Thu 30th Sep 2021 06:17 PM
nani,vijay,vamsi paidipally,vijay-vamsi paidipally project  హీరో నాని న్యూ అవతార్
Hero Nani New Avatar హీరో నాని న్యూ అవతార్
Advertisement
Ads by CJ

ఇప్పుడు హీరోలు కేవలం హీరోయిజం చూపించడానికి మాత్రమే కమిట్ అయ్యి ఉండడం లేదు. విలన్ అయినా, ఇంకా స్పెషల్ కేరెక్టర్స్ ఏం వచ్చినా ఆ పాత్రలని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా హీరో విజయ్ సేతుపతి, మరో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. వీరిద్దరూ హీరో లు గాను, విలన్స్ గాను దున్నేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో కార్తికేయ కూడా విలనిజాన్ని ట్రై చేసాడు. ఇప్పుడు అజిత్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. తాజాగా మరో యంగ్ హీరో నాని కూడా విలన్ పాత్రలు చెయ్యడానికి రెడీ అయినట్లుగా సోషల్ మీడియా టాక్.

అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు డైరెక్టర్ అండ్ నిర్మాతలు అయిన వంశి పైడిపల్లి - దిల్ రాజు కాంబోలో మొదలు కాబోతున్న మూవీ లో నాని విలన్ పాత్ర చేయబోతున్నాడనే న్యూస్ మొదలైంది. ఆ విలన్ పాత్ర కోసం నానికి భారీ మొత్తంలో పారితోషకం ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. నాని విలన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందట.. అందుకే నాని వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈమధ్యన నాని నటించిన సినిమాలు వరసబెట్టి ప్లాప్ అవుతున్నాయి. ఆ క్రమంలో నాని నిర్ణయంపై ఆయన ఫాన్స్ హ్యాపీ గా ఉన్నారు. . విజయ్ - వంశి పైడిపల్లి - దిల్ రాజు మూవీ అఫీషియల్ ప్రకటన ఈమధ్యనే వచ్చింది. హీరోయిన్ గా ఇంకా ఎవరిని ఫైనల్ చెయ్యలేదు. త్వరలోనే విజయ్ - వంశి పైడిపల్లి మూవీ డిటైల్స్ తెలియజేస్తామని టీం చెబుతుంది. 

Hero Nani New Avatar :

Nani with Vijay-Vamsi Paidipally project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ