ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఏపీ లోను కాక పుట్టిస్తున్నాయి. మెగా హీరో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గాను, సినిమాల పరంగా హీట్ ని రాజేయ్యడంతో.. మెగా ఫ్యామిలీ గమ్మునుండి పోయింది. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ కే సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఏపీ మినిస్టర్ నాని మాత్రం పవన్ వ్యాఖ్యలపై చిరు బాధపడుతున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా నాగబాబు వేర్వేరు సిద్ధాంతాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకూ తన సోదరులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను విడిచిపెట్టనని అన్నారు. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగబాబు చాల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
ఈ చిట్ చాట్ లో నాగబాబు పాలిటిక్స్ మీద తనకి ఆసక్తి పోయిందంటూ సంచలన కామెంట్స్ చేసారు. రాజకీయాల్లో లేకపోయినా.. నా సహాయం కోరేవారికి అండగా ఉంటాను అని చెప్పిన నాగబాబు తుదిశ్వాస వరకూ నా సోదరులతోనే ఉంటాను. రాజకీయంగా కాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి నాకు చేతనైనంత సాయం చేస్తాను అని చెప్పాడు. ఓ అభిమాని మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఏం మారాలి? అని అడగ్గా.. మగాడి మైండ్‌సెట్ మారాలంటూ నాగబాబు సమాధానమిచ్చారు.