పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న బుధవారం టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రి మూవీ మేకర్స్, డివివి దానయ్య లు ఏపీ మినిస్టర్ పేర్ని నాని భేటీ అవడం హాట్ టాపిక్ అవగా.. పేర్ని నాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు చిరు చింతిస్తున్నారని ప్రకటించేసారు. పవన్ కళ్యాణ్ మాటలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని నిర్మాతలు తేల్చేసారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ఏపీ ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. పవన్ వ్యాఖ్యలకు ఎలాంటి స్పందన లేని చిరు పవన్ విషయంలో అంతగా బాధపడ్డారా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిస్తుంది.
అయితే రేపు చిరంజీవి రాజమహేంద్ర వరం వెళ్లనున్నారు. అక్కడ తన మామగారు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని.. ఆయన పేరిట ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య హోమియో కళాశాల ప్రధాన ద్వారం దగ్గర ఆవిష్కరించనున్నారు. మరి విగ్రహావిష్కరణ తర్వాత చిరంజీవి.. ఏపీ ప్రభుత్వంతో పాటు పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఎమన్నా స్పందిస్తారేమో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరోపక్క చిరు అమరావతి వచ్చి ఏపీ ప్రభుత్వ పెద్దలని భేటీ అయ్యి పవన్ వ్యాఖ్యలపై, అలాగే ఆన్ లైన్ టికెట్ విక్రయించే విషయమై మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.