రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ని అనరాని మాటలతో రెచ్చిపోయి మాట్లాడిన పోసాని కృష్ణమురళకి చావు భయం అంటే ఏమిటో చూపించారు పవన్ ఫాన్స్. పోసాని కృష్ణమురళి తానే పత్తిత్తు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ని సైకో అంటూ సంభోదిస్తూ చెలరేగిపోయాడు. అయితే పోసాని చేసిన వ్యాఖ్యలకు తమ్మారెడ్డి స్పందిస్తూ ఇలాంటివి మాట్లాడడం పోసానికి తగదని అన్నారు. ఇక తాజాగా పోసాని కృష్ణ మురళితో పని చేసిన ఓ నిర్మాత పోసాని పై ఫైర్ అయ్యాడు. పోసాని కృష్ణ మురళి మెయిన్ లీడ్ లో నటించిన మెంటల్ కృష్ణ, రాజవారి చేపల చెరువు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన నల్లం శ్రీనివాస్ ఆ తర్వాత పోసానితో పోసాని జెంటిల్మెన్ అనే సినిమాను నిర్మించాడు.
శ్రీనివాస్ పోసాని ప్రవర్తనపై ఓ వీడియోని రిలీజ్ చేసాడు. పోసానిని పలకలేని పదజాలంతో దూషిస్తూ.. పోసాని కృష్ణమురళి తాను చేసిన జెంటిల్మన్ సినిమా సమయంలో తనను దారుణంగా మోసం చేసాడని, మంచి సినిమా చేస్తానని చెప్పి డీ- గ్రేడ్ సినిమా తీసి నా చేతిలో పెట్టావు. ఆలు నీలాంటి వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు అంటూ పోసానిపై శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. నాలాంటోళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర డబ్బులు దొబ్బవో చెప్పనా.. నువ్వు సినిమా షూటింగ్ సమయంలో అమ్మాయిలతో నడిపిన రాసలీలలు బయటపెట్టానా.. నా కాళ్ళ ముందు చేసిన నీచమైన పనులు చెప్పాలా.. నువ్వు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా అంటూ శ్రీనివాస్ పోసాని ని ఓ ఆట ఆదుకున్నాడు.
నీలాంటి వాడి వాళ్ళ మోసపోయిన నిర్మాతను నేను.. నువ్వు పవన్ గురించి నిర్మాతల గురించి మాట్లాడే వాడివి.. ఇంకోసారి పవన్ గురించి మాట్లాడితే.. పిచ్చిపిచ్చిగా కొడతాను.. ఆయన రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించేంత గొప్పవాడివా.. ఆయన తీసుకునే దానికి ట్యాక్స్ కడతాడు. నువ్ కడతావా అంటూ శ్రీనివాస్ పోసానిని ఆ వీడియో ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.