Advertisementt

చిరంజీవి అంతగా బాధపడ్డారా

Wed 29th Sep 2021 08:07 PM
megastar chiranjeevi,pawan kalyan,comments,chiranjeevi,minister perni nani  చిరంజీవి అంతగా బాధపడ్డారా
Chiranjeevi Upset With Pawan Kalyan Speech? చిరంజీవి అంతగా బాధపడ్డారా
Advertisement

పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో ఏపీ గవర్నమెంట్ పై చేసిన వ్యాఖ్యలు, సినిమా ఇండస్ట్రీ పై చేసిన వ్యాఖ్యలతో అటు ఏపీ మినిస్టర్స్ కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ ఏకీభవించడం లేదు. నాగబాబు పవన్ వ్యాఖ్యలపై పాజిటివ్ గా మాట్లాడాడు. పవన్ పై సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేసారు. మరో వైపు తెలుగు నిర్మాతల మండలి పవన్ మాటలతో తాము ఏకీభవించడం కాలేదన్నారు. ఇక మంచు విష్ణు కూడా పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదన్నాడు. కానీ చిరంజీవి మాత్రం పవన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. ఇలాంటి టైం లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు, దానయ్య, మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతలు, బన్నీ వాసు, సునీల్ నారంగ్ లు ఏపీ మినిస్టర్స్ నాని తో సమావేశమవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

అయితే సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో భేటీ తర్వాత పేర్ని నాని మీడియా మీట్ నిర్వహించారు. ప్రభుత్వం టిక్కెట్ల ధర విషయంలో మరోమారు యోచించాలని నిర్మాతలు ఏపీ ప్రభుతాన్ని కోరారన్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నిర్మాతలతో కూలంకుషంగా చర్చించారన్నారు నాని. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎవరో పిచ్చి వాగుడుతో తమకి సంబంధం లేదని, సినిమా ఈవెంట్ లో పవన్ వ్యాఖ్యలతో చిరంజీవి చాలా బాధపడ్డారని అది చెప్పడానికే నిర్మాతలు తనదగ్గరకు వచ్చారంటూ నాని సంచలనంగా మీడియా ముఖం గా ప్రకటించారు. (మరి నాని అన్నారంటే నిజంగానే చిరు పవన్ విషయంలో అంతగా బాధపడుతున్నారా అంటూ ఇప్పుడు అనుమానంలో ఉన్నారు ఫాన్స్) అంతేకాకుండా ఆన్ లైన్ టిక్కెటింగ్ కొత్తదికాదని ఆ విధానానికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందన్నారు. టాలీవుడ్ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ది కిరాయి పార్టీ అని, ఎవరు రెంట్ కి అడిగినా ఇచ్చేస్తారు అంటూ నాని పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక దిల్ రాజు మట్లాడుతూ..  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో సున్నితమైనదని, లేనిపోని వివాదాస్పద అంశాలు లేవనెత్తి గందరగోళ పరిస్థితులు దయచేసి  లేవనెత్తవద్దని చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమ బాగుండాలనే కోరుకొంటాయని తమ పట్ల ఎంతో సానుకూలంగా ఉంటున్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు, జరుగుతున్న వ్యతిరేక పరిణామాలు తమ అభిప్రాయం కాదని, ముఖ్యమంత్రికి తమ అభిప్రాయం దయచేసి తెలియచేయాలని మంత్రి పేర్ని నానికు వివరించినట్లు దిల్ రాజు పేర్కొన్నారు.    

Chiranjeevi Upset With Pawan Kalyan Speech?:

Chiranjeevi Angry on Pawan Kalyan Comments says Minister Perni Nani

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement