Advertisementt

నా వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్: పవన్

Wed 29th Sep 2021 05:15 PM
pawan kalyan,janasena,ycp,ap cm jagan,dogs,pawan press meet  నా వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్: పవన్
My personal life is black and white: Pawan నా వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్: పవన్
Advertisement
Ads by CJ

గత శనివారం జరిగిన రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యల ఫలితం పవన్ ని పట్టుకుని ఏపీ మినిస్టర్స్ అనరాని మాటలతో రెచ్చిపోతున్నారు. మరోపక్క పోసాని లైవ్ లోకొచ్చి పవన్  కళ్యాణ్ ని పొలిటికల్ గాను, పర్సనల్ గాను రెచ్చగొడుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన విస్తృత స్థాయి సమావేశం కోసం మంగళగిరి వెళ్లారు. అక్కడ పార్టీ ఆఫీస్ లో పవన్ జనసేన కార్యకర్తలతో మీట్ అయ్యారు. ఆ తర్వాత పవన్ ప్రెస్ మీట్ పెడుతున్నారనగానే అందరిలో ఆశక్తి. పవన్ పై వస్తున్న వార్తలపై పవన్ ఎలాంటి సంధానం ఇవ్వబోతున్నారు, ఎలాంటి మాటల తూటాలతో విరుచుకుపడతారో అనే క్యూరియాసిటీతో పవన్ ప్రెస్ మీట్ కోసం వెయిట్ చేసారు.

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ప్రసంగం మొదలు పెట్టడమే వైసీపీ గ్రామా సింహాలు అంటూ మొదలు పెట్టాడు. వాగి పళ్ళు రాలగొట్టించుకోవడం కుక్కలకు అలవాటు.. అంటూ వైసిపి నేతలను టార్గెట్ చేసారు. నా పర్సనల్ జీవితం గురించి కెలుకుతున్నారు. ఆఖరికి మీ నాయకుడు జగన్ కూడా నా వ్యక్తిగత జీవితం, నా మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడాడు.. నా జీవితం ఏముంది బ్లాక్ అండ్ వైట్, మీదే రంగుల జీవితం, కులాల చాటున దాక్కుంటే.. బయటికి లాక్కొచ్చి కొడతాను. మీకు అన్ని ఉన్నా భయం లేదు.. ఆ భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తాను. నాకు భూతులు మాట్లాడడం రాక కాదు.. నేను గుంటూరు బాపట్లలో పుట్టిన వాడినే. భూతులు వచ్చు కానీ నా తల్లితండ్రులు సంస్కారం నేర్పించారు. రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి భూతులు మాట్లాడలేను. నేను కానీ నా జనసైనికులు కానీ వైసిపి నేతల ఆడవాళ్లను తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో వైసిపి నేతలను ఓ ఆట ఆడుకున్నారు.

ఇక టికెట్ రేట్ల గురించి మాట్లాడాను కానీ అది చాలా చిన్న పాయింట్. నాకేమన్నా థియేటర్స్ ఉన్నాయా.. మీ వైసిపి వాళ్ళకే థియేటర్స్ ఉన్నాయి. కాకినాడలో మీ థియేటర్స్ కాదా.. అయినా కష్టపడేవాడికి హక్కు ఉంటుంది. కష్టాన్ని లాగేసుకోవద్దు.. నాతో పెట్టుకుంటే తోలు తీస్తా అంటూ వైసిపి నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 

My personal life is black and white: Pawan:

Pawan Kalyan Press meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ