మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ మూవీ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. దేవా కట్ట దర్శకత్వంలో సాయి తేజ్ - ఐశ్వర్య రాజేష్ కలయికలో రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేసిన రిపబ్లిక్ మూవీ రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. మెగా మేనల్లుడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి.. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండడంతో.. రిపబ్లిక్ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నాడు. దానితో మేనమావలు స్టార్స్ అయిన పవన్, చిరు లు రిపబ్లిక్ ని ప్రమోట్ చేసారు. అయితే గత వారం వరకు సాయి తేజ్ హెల్త్ అప్ డేట్ ని ఎప్పటికప్పుడు మీడియాకి రిలీజ్ చేసిన అపోలో డాక్టర్స్ ఇప్పుడు సాయి తేజ్ హెల్త్ అప్ డేట్ ఇవ్వడం లేదు.
పవన్ చూస్తే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి తేజ్ ఇంకా కోమాలో పడి ఉన్నాడన్నారు. ఆ తర్వాత సాయి తేజ్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చెయ్యలేదు. అసలు సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి? నిజంగానే సాయి తేజ్ కోమాలోనే ఉన్నాడా? లేదంటే కోలుకుంటున్నాడా? ఒకవేళ కోలుకుంటుంటే.. డాక్టర్స్ అప్ డేట్ ఇవ్వొచ్చు కదా.. భుజానికి, ఓకల్ కార్డు ఆపరేషన్స్ సక్సెస్ అయ్యాయని.. ప్రకటించిన డాక్టర్స్ సాయి తేజ్ ఆరోగ్యం పై అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఆయన ఫాన్స్ కంగారు పడుతున్నారు. సినిమా రిలీజ్ పెట్టుకుని కనీసం సాయి తేజ్ హాస్పిటల్ లో ఉన్న బైట్ వదిలినా సినిమాపై అందరిలో ఆశక్తి పెరుగుతుంది. కాని సాయి తేజ్ హాస్పిటల్ లో ఉన్నా..ఎలాంటి అప్ డేట్ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటున్నారు ఫాన్స్.