Advertisementt

పవన్ కూడా తగ్గడం లేదుగా..

Tue 28th Sep 2021 01:24 PM
pawan kalyan,jagan government,ap government,ycp,pawan tweets  పవన్ కూడా తగ్గడం లేదుగా..
Pawan tweets about AP Government పవన్ కూడా తగ్గడం లేదుగా..
Advertisement
Ads by CJ

ఓ పక్క సినిమాల షూటింగుల్లో బిజీ బిజీగా మారిన పవన్ కళ్యాణ్ రాజకీయాలను లైట్ తీసుకుంటారు అనుకుంటే..  సినిమా షూటింగ్స్ పని సినిమా షూటింగ్స్ అన్నట్టుగా మేనల్లుడి సినిమా ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై పొలిటికల్ గాను పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లుగా అర్ధమవుతుంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడ‌తాన‌ని ఇప్ప‌టికే పవన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ స‌ర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తర్వాత పవన్ పై ఏపీ మంత్రులు, సినిమా నటులు ఎదురు దాడికి దిగుతున్నారు.

అయినా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండడం లేదు.. అసలు ఏ మాత్రం తగ్గడం లేదు.. సోషల్ మీడియా వేదిక‌గా ఏపీ స‌ర్కారుపై, మినిస్టర్స్ పై తనపై విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. గత రాత్రి పోసాని కృష్ణ మురళికి సోషల్ మీడియా ద్వారా ఘాటుగా రిప్లై ఇచ్చిన పవన్ తాజాగా ఏపీ ప్రభుత్వం పై మ‌రో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పాలసీ ఉగ్రవాదంకి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. మరి పొలిటికల్ గా బాగా బిజీ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే వైసిపిపై పవన్ కళ్యాణ్ ఇలా సోషల్ మీడియా దాడికి దిగుతున్నారని స్పష్టమవుతుంది. 

Pawan tweets about AP Government:

Pawan Kalyan tweets about Jagan Government 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ