Advertisementt

వెడ్డింగ్స్ ప్లాన్ లో ఆర్.ఆర్.ఆర్ భామ

Tue 28th Sep 2021 10:23 AM
ranbir kapoor,alia bhatt,ranbir kapoor and alia bhatt,jodhpur  వెడ్డింగ్స్ ప్లాన్ లో ఆర్.ఆర్.ఆర్ భామ
Ranbir Kapoor, Alia Bhatt in Jodhpur వెడ్డింగ్స్ ప్లాన్ లో ఆర్.ఆర్.ఆర్ భామ
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. అటు బాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీ. మధ్యలో బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతూ అవకాశం వచ్చినప్పుడు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేసే ఈ భామ.. రణబీర్ ని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో అనే క్యూరియాసిటిలో ఆమె ఫాన్స్ మాత్రమే కాదు.. బి టౌన్ మొత్తం ఎదురు చూస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో రణబీర్ కపూర్ కరోనా లాక్ డౌన్ లేకపోతే పెళ్లి చేసుకునేవాళ్ళమే.. కరోనా తగ్గగానే మా పెళ్లి అంటూ చెప్పడంతో వారి పెళ్లిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.

అయితే తాజాగా అలియా భట్ అండ్ రణబీర్ లు వెడ్డింగ్ ప్లాన్స్ లో బిజీగా వున్నారని తెలుస్తుంది. వీరిద్దరూ జోధ్ పూర్ వెళ్లి అక్కడ తమ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. రణబీర్ కపూర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ తర్వాత అలియా అండ్ రణబీర్ లు పెళ్లి పై ఓ నిర్ణయానికి వస్తారని, జోద్ పూర్ లోనే రణబీర్ కపూర్ - అలియా భట్ లు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని.. అక్కడ కొద్దిమంది ఆప్తుల మధ్యన వెడ్డింగ్ పూర్తి చేసుకుని.. ముంబై లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వాలని అలియా భట్ అండ్ రణబీర్ లు నిర్ణయించుకున్నట్టుగా టాక్. మరి ఈ ఏడాది అయినా.. అలియా భట్ - రణబీర్ ల పెళ్లి చూస్తామో లేదో.. అనుకుంటున్న ఫాన్స్ కి ఈ వార్త ఉత్సాహాన్నిచ్చింది. 

Ranbir Kapoor, Alia Bhatt in Jodhpur:

Ranbir Kapoor, Alia Bhatt marriage soon 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ