పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరిగా పవన్ పై ఘాటైన విమర్శలు చేసారు. ఇండస్ట్రీ నుండి నాని, కార్తికేయ లాంటి హీరోలు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపగా.. మిగతా వారు కామ్ గానే ఉన్నారు. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని రెండు రాష్ట్రాల సపోర్ట్ ఇండస్ట్రీకి కావాలని లేఖ రాసేశారు. ఇక పవన్ వ్యాఖ్యలకు మోహన్ బాబు మా ఎన్నికల తర్వాత సమాధానం చెబుతా అన్నారు. ఇక తాజాగా పోసాని కృష్ణ మురళి పవన్ పై తీవ్ర విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ ఏ హక్కుతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మనిషి కాదు, అటు ప్రజల మనిషి కాదు. ప్రజల్లో పవన్ కి ఏ మాత్రం అర్హత ఉందో.. ఎలక్షన్స్ లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడే అర్ధమైంది.
ఇక ఓ సినిమా ఈవెంట్ లో ఓ ముఖ్యమంత్రి, మంత్రులపై కామెంట్స్ చెయ్యడమేమిటి. అసలు పవన్ కళ్యాణ్ పోరాడితే.. పంజాబ్ అమ్మాయికి అవకాశాలు ఇస్తామని మోసం చేసి కడుపు చేసారు. పవన్ కి దమ్ముంటే.. ఆ అమ్మాయికి న్యాయం చెయ్యమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏమిటో పరిశ్రమకి, ప్రపంచానికి తెలుసు. సినిమా ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేసినా నేను పవన్ పై మాట్లాడడానికి భయపడను. నువ్వు ఒక్కమాటంటే జనాలు పది మాటలంటారు. నువ్వు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా? దిల్ రాజుకి ఎందుకు రెడ్డి కులాన్ని పులుముతావు? చప్పట్లు కోసం అబద్దాలు చెప్పడం అవసరమా? ఏపీ సీఎం కి కుల పిచ్చి ఉంటే.. చిరంజీవికి అన్నం పెట్టి శాలువా కప్పుతాడా? పవన్ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించగలరు.
పవన్ తనకి తానే ప్రశ్నలు వేసుకుంటారు. తానే సమాధానాలు చెప్పుకుంటారు. పవన్ ప్రశ్నించడంతో తప్పులేదు.. సాక్ష్యాలు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ అంతటివాడు.. ఓ మినిస్టర్ అయిన నాని తో అన్ని మాటలు అనిపించుకుంటాడా అంటూ పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి.. ఛానల్స్ లైవ్ లో సెన్సేషనల్ గామాట్లాడారు. .