Advertisementt

లైగర్‌ రింగ్ లోకి లెజెండ్ మైక్ టైసన్

Mon 27th Sep 2021 04:34 PM
legend mike tyson,vijay deverakonda,puri jagannadh,karan johar,charmme,crazy pan india project,liger movie,liger  లైగర్‌ రింగ్ లోకి లెజెండ్ మైక్ టైసన్
Mike Tyson enters Vijay Devarakonda Liger లైగర్‌ రింగ్ లోకి లెజెండ్ మైక్ టైసన్
Advertisement
Ads by CJ

మోస్ట్ హ్యపెనింగ్ హీరో  విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ మూవీ ప్రియులకి, బాక్సింగ్ అభిమానులకు అలాగే సాధారణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఐఫీస్ట్ కానుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్‌లో లెజెండ్ మైక్ టైసన్ మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు. ఈ సంద‌ర్భంగా  ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్, బాక్సింగ్‌లో లెజెండ్ అయిన మైక్ టైసన్ గారిని లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురావడం ఎంతో అద్భుత‌మైన విష‌యం. మేము మా  వాగ్దానాన్ని మేము ఇప్పుడే ప్రారంభించాము. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్, బాక్సింగ్ గాడ్‌, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐర‌న్ మైక్ టైసన్ అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు.

బాక్సింగ్‌లో తన పంచులతో ఎంతో మంది ప్రత్యర్థులను నేలకు ఒరిగించిన మైక్ టైసన్ ఇప్పుడు లైగర్ చిత్రంలో నటించబోతోన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఐరన్ మైక్ పాత్రలో ఆయన కనిపించబోతోన్నారు. ఇక మైక్ టైసన్ రాకతో.. ఈ చిత్రం పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాగా మారింది. లైగర్‌ మూవీలో ఎంతో మంది విదేశీ ఫైటర్లు కూడా ఉన్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తోంది చిత్రయూనిట్. బ్లడ్ స్వెట్ వయలెన్స్ అనే క్యాప్షన్‌తో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేస్తున్నారు.

Mike Tyson enters Vijay Devarakonda Liger:

Legend Mike Tyson On Board For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Crazy Pan India Project LIGER

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ