బిగ్ బాస్ సీజన్ 5 లో ఇప్పటివరకు మూడు వారాలు గడిచాయి. మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొత్తం బిగ్ బాస్ హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. ఫస్ట్ వీక్ లో సరయు, సెకండ్ వీక్ లో ఉమాదేవి లు ఎలిమినేట్ అవ్వగా.. వారు బిగ్ బాస్ స్టేజ్ మీద హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గుట్టు విప్పి ఆ ఎపిసోడ్స్ కి మంచి క్రేజ్ తెచ్చారు, సరయు అయితే పోతూ పోతూ షణ్ముఖ్, సన్నీ, సిరులను బాగా వేసుకుంది. వాళ్ళని మరీ నీచంగా మాట్లాడి బిగ్ బాస్ కి కంటెంట్ ఇచ్చింది. ఇక ఉమాదేవి ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా కాస్త ఇంట్రెస్ట్ గానే అనిపించింది. కానీ గత రాత్రి లహరి మూడో కంటెస్టెంట్ గా బయటికి వెళ్ళింది. ఆ ఎపిసోడ్ చాలా చప్పగా సాగింది.
అసలే నిన్న ఆదివారం ఎపిసోడ్ శనివారమే లీకైపోయింది. అదే బిగ్ బాస్ కి దెబ్బ అనుకుంటే.. లహరి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద నాగ్ పక్కన నిల్చుని.. హౌస్ మేట్స్ మీద ఎలాంటి సెన్సేషన్ కామెంట్స్ చెయ్యకుండా.. జస్ట్ షణ్ముఖ్ ని నువ్వు సిరి నన్ను నామినేట్ చేసింది అని నామినేట్ చేసావ్.. అరె ఏంట్రా ఇది అన్నది. దానికి నువ్ అలా అనుకున్నావ్ కాబట్టే అక్కడ ఉన్నావ్. నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు తప్ప ఈ ఎపిసోడ్ అంతగా ఇంట్రెస్ట్ కలిగించలేదు. ఆదివారం ఫన్ డే అంటూ నాగ్ కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడించినా.. ఎలిమినేషన్ వచ్చేసరికి హౌస్ అంతా సీరియస్ అవడమే కాదు.. స్టేజ్ మీద నించున్న వారు తమ గురించి ఏం చెబుతారో అనే భయంతో ఉండేవారు. కానీ లహరి చాలా లైట్ గా మాట్లాడేసి ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవనేసి ఈ ఎపిసోడ్ ని నీరు కార్చేసింది.