విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో కరణ్ జోహార్ - ఛార్మి - పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతె.. లైగర్ మూవీ ఈ నెలలోనే వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ అలాగే పూరి, ఛార్మి ల మనీ లాండరింగ్ కేసు.. లైగర్ షూటింగ్ లేట్ అయ్యేలా చేసాయి. లైగర్ సలా కా బ్రీడ్ అంటూ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ లైగర్ లుక్ ని గత ఏడాదిన్నరగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సూపర్ ఫిట్ గా, లుక్ పరంగా కొత్తదనం చూపిస్తున్నాడు.
అయితే గోవా లో లైగర్ చిత్రీకరణలో ఉన్న టీం రేపు అంటే సెప్టెంబర్ 27 న లైగర్ కి సంబందించిన బిగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. An arena filled up with Bloody Excitement 💥🥊 STRIKING ANNOUNCEMENT of #LIGER on 𝐒𝐞𝐩𝐭 𝟐𝟕𝐭𝐡 @ 𝟒𝐏𝐌 లైగర్ స్ట్రైకింగ్ ఎనౌన్సమెంట్ రేపు సాయంత్రం 4 గంటలకు అంటూ ప్రకటించడంతో విజయ్ దేవరకొండ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంటే రేపు సాయంత్రం లైగర్ మూవీ అప్ డేట్.. అంటే లైగర్ రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ ఇస్తారేమో మేకర్స్ అంటూ వాళ్ళు ఇప్పుడు హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారు.