నందమూరి అభిమానులు ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీ రిలీజ్ డేట్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. దసరా కి అఖండ రిలీజ్ ఉంటుంది అనుకుంటే.. బాలయ్య అండ్ బోయపాటి లు ఇంకా సైలెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ ఇవ్వడం లేదు. ఇక తాజాగా నందమూరి అభిమానులు చెన్న కేశవ రెడ్డి సినిమా విడుదలై 19 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సందడి సందడి చేసేసారు.
దానిలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని దేవి 70MM ధియేటర్ లొ రాత్రి 9గంటలకు ప్రత్యేకంగా చెన్న కేశవ రెడ్డి స్పెషల్ షో ఏర్పాటు చేసుకొని టపాసులు కాల్చి పండగ వాతావరణం సృష్టించడమే కాదు.. నానా హంగామా చేసారు.. ధియేటర్ పుల్ అవటం, నందమూరి అభిమానుల విజిల్స్, డాన్స్ లు, కేకలతో హోరెత్తించారు. ఫ్యామిలి ఆడియన్స్ కూడా బాలయ్య అభిమానుల తో కలసి తెగ ఏంజాయ్ చేసారు..