Advertisementt

పవన్ కి 50.. రానాకి?

Sat 25th Sep 2021 06:19 PM
pawan kalyan,rana,bhimla nayak,pawan kalyan bhimla nayak  పవన్ కి 50.. రానాకి?
50 to Pawan .. to Rana? పవన్ కి 50.. రానాకి?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లిమ్బ్స్, రానా డ్యానియల్ శేఖర్ ఫస్ట్ గ్లిమ్బ్స్ ట్రెండ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ వైఫ్ గా నిత్యా మీనన్, రానా వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 50 కోట్లు అందుకుంటున్నాడట. ఈ సినిమా కోసం పవన్ కి మేకర్స్ ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో భీమ్లా నాయక్ గా టైటిల్ రోల్ పోషిస్తున్న పవన్ కళ్యాణ్ - రానా లు పోటాపోటీగా ఈగో పర్సన్స్ గా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం దగ్గుబాటి రానా కేవలం 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడని.. దానికి గాను భీమ్లా నాయక్ మేకర్స్ 4 కోట్ల పారితోషకం ఇస్తున్నారని టాక్. రానా నెగెటివ్ గా నటిస్తుండగా.. పవన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే పవన్ కి 50 కోట్లు, రానా కి మరీ 4 కోట్లేనా అంటూ రానా ఫాన్స్ ఫీలవుతున్నారు. పవన్ క్రేజ్ ముందు రానా ఎంతటి వాడు అంటుంటే.. రానా కూడా పాన్ ఇండియా స్టార్. ఆయన పాన్ ఇండియా మూవీస్ తో అదరగొట్టేస్తున్నాడు. కాబట్టి కాస్త చూసి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి అంటున్నారు ఆయన ఫాన్స్. ప్రస్తుతం భీమ్లా నాయక్ కి రానా పారితోషకమే ఇప్పుడు హాట్ టాపిక్.

50 to Pawan .. to Rana?:

Pawan Kalyan Bhimla Nayak Glimpses Is trending

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ