ఏప్రిల్ లో దిల్ రాజు వకీల్ సాబ్ ని సెకండ్ వేవ్ కి ముందు రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కానీ.. సెకండ్ వేవ్ వలన థియేటర్స్ మూతబడడం, ఉన్న చోట 50 పర్సెంట్ అక్యుపెన్సీతో రన్ అవడంతో వకీల్ సాబ్ కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ మాత్రం మిస్ అయ్యాయి. అదే టైం లో 50 పర్సెంట్ అక్యుపెన్సీతో లవ్ స్టోరీని రిలీజ్ చెయ్యడం ఇష్టం లేని మేకర్స్ ప్రమోషన్స్ పూర్తయినా సినిమా రిలీజ్ ఆపేసారు. కరోనా సెకండ్ వేవ్ కారణముగా లవ్ స్టోరీని ఆపేసినట్లుగా ప్రకటించారు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ, సెకండ్ వేవ్ ని లెక్క చెయ్యకుండా రిలీజ్ చేసినట్లయితే మేకర్స్ కి కోలుకోలేని దెబ్బ పడేదే.
కానీ మేకర్స్ లవ్ స్టోరీ పై ఉన్న నమ్మకంతో సెకండ్ వేవ్ తగ్గి థియేటర్స్ ఓపెన్ అయిన నెలన్నరకు కానీ లవ్ స్టోరీ ని రిలీజ్ చెయ్యలేదు. అదే వినాయక చవితికి రిలీజ్ చేసినా టక్ జగదీశ్ ముందు కలెక్షన్స్ గండి పడేది. కానీ అప్పుడు కూడా మేకర్స్ తెలివిగా రిలీజ్ డేట్ మార్చేసి.. ఈ రోజు సెప్టెంబర్ 24 న రిలీజ్ చేసి హిట్ కొట్టేసారు. లవ్ స్టోరీకి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూస్ రావడంతో సోషల్ మీడియాలోనూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవడం చూస్తే ఈ సినిమా కలెక్షన్స్ ఢోకా ఉండదనే చెప్పొచ్చు. ఇప్పటికే శుక్ర, శని, ఆది వారాల బుకింగ్స్ పూర్తయ్యాయి.. లవ్ స్టోరీ థియేటర్ హౌస్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో ఏప్రిల్ లో రిలీజ్ అయినా, వినాయక చవితికి రిలీజ్ అయినా లవ్ స్టోరీ కి బాగా గట్టి దెబ్బపడేదే.. కానీ ఇప్పుడు సేఫ్.