Advertisementt

మంచు విష్ణు ఎవరి గురించి చెప్పాడబ్బా

Fri 24th Sep 2021 09:20 PM
manchu vishnu,manchu vishnu press meet,maa elections,maa  మంచు విష్ణు ఎవరి గురించి చెప్పాడబ్బా
Manchu Vishnu Sensational comments on MAA Elections మంచు విష్ణు ఎవరి గురించి చెప్పాడబ్బా
Advertisement
Ads by CJ

అక్టోబర్ 10 న జరగబోయే మా ఎన్నికల ప్రచారం టాలీవుడ్ లో హీట్ పుట్టిస్తుంది. ప్రకాష్ రాజ్ ఎప్పుడో తన ప్యానల్ ని ప్రకటించి మా ఎన్నికల ప్రచారం అంటూ లంచ్ పార్టీలు ఇస్తున్నాడు. మంచు విష్ణు తాజాగా తన ప్యానల్ ప్రకటించి డిన్నర్ పార్టీ ఇచ్చి మరీ మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ కూడా మంచు విష్ణునే సపోర్ట్ చేస్తున్నాడు. ఇక ఈ రోజు మీటింగ్ లో తాను మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనగానే ఓ పెద్ద స్టార్ మా నాన్న గారికి ఫోన్ చేసి విష్ణుని నిలబడొద్దు.. తప్పుకోమని అడిగారు. మరో సీనియర్ స్టార్ నేను ఓటు వేస్తాను బైట్స్ ఇవ్వమంటే కుదరదని చెప్పారు. మా ఎన్నికల నేపథ్యంలో ఇండస్ట్రీ రెండుగా విడిపోయింది అంటూ విష్ణు సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అందులో అందరూ ఓ వర్గానికే సపోర్ట్ చేస్తూ మిగతా వారికి సపోర్ట్ చేస్తే ఏమవుతుందో అనే భయంలో ఉన్నారు. ఆఖరికి నేను పెంచి పోషించి, అన్నం పెట్టిన వారిని నాకు సపోర్ట్ చెయ్యమని అడిగితె సైలెంట్ గా తప్పుకున్నారు. వాళ్ళని కూడా భయపెట్టారు అంటూ విష్ణు సంచలనంగా మాట్లాడాడు. ఇక మా నాన్నగారు చెబితే నేను పోటీలో నిలబడలేదు. ఇండస్ట్రీ పెద్దలు అడిగితేనే నేను పోటీ చేస్తున్నాను. ఓ స్టార్ హీరో ఫోన్ చేసి నన్ను తప్పుకోమనగానే ఓ ఐదారు వందల మందికి ఫోన్ చేసి సపోర్ట్ చెయ్యమని అడిగారు తప్ప.. ఇంకేమి లేదు అంటూ మా ఎన్నికలపై విష్ణు సంచలంగా మాట్లాడాడు. 

అయితే మంచు మోహన్ బాబు కి ఫోన్ చేసి విష్ణుని తప్పుకోమన్నది మెగాస్టార్ అంటూ అప్పుడే ప్రచారం మొదలైపోయింది. 

Manchu Vishnu Sensational comments on MAA Elections:

Manchu Vishnu Press Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ