సౌత్ లో క్లిక్ కానీ తాప్సి.. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అనుభవిస్తుంది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పరుచుకోవడమే కాదు.. బడా హీరోయిన్ కంగనా రనౌత్ మాటల యుద్దానికి ప్రతి యుద్ధం చేస్తూ అక్కడ తట్టుకుని నిలబడగలుగుతుంది. అయితే తాజాగా తాప్సి నటించిన రష్మీ రాకెట్ రిలీజ్ కి సిద్దమవుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాలో తాప్సి.. అథ్లెట్ గా కనిపించేందుకు జిమ్ లో నానా కష్టాలు పడి కండలు పెంచింది. ఈ సినిమాలో పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో తాప్సి అబ్బాయిలకు తీసిపోని అని నిరూపించుకుంది.
అయితే తాప్సి రష్మీ రాకెట్ సినిమాలో మరీ అబ్బాయి మాదిరిలా కనిపిచింది. మగాడిలా ఉన్నావ్ అంటూ నేటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయి అంత శ్రమించి గొప్పగా తయారయ్యింది, సినిమాలో సూపర్బ్ గా కనిపించబోతుంది అని కాకుండా.. మగాడిలా ఉన్న అంటూ హేళన చెయ్యడంతో.. తాజాగా తాప్సి ఆ విషయంపై స్పందించింది. ఇలాంటి ట్రోలింగ్స్ ను, కామెంట్స్ ని తాను కాంప్లిమెంట్స్ గా తీసుకుంటానని.. తాను ఎంతో కష్టపడి, జిమ్ చేసి అథ్లెట్ లుక్ ను సాధించానని.. తన బాడీని చూసి మగాడివంటూ కామెంట్లు చేయడం తనకు ఒక కాంప్లిమెంట్ తో సమానం అంటూ తాప్సి రియాక్ట్ అయ్యింది.