ఇప్పుడు చాలామంది కాజల్ అగర్వాల్ కి ప్రెగ్నెంట్, అందుకే ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆచార్య షూట్ చకచకా కంప్లీట్ చెయ్యడం, నాగార్జున సినిమా ఘోస్ట్ నుండి కాజల్ తప్పుకోవడం, ఇతర సినిమాలేవీ ఒప్పుకోకపోవడంతో కాజల్ అగర్వాల్ నిజంగానే ప్రెగ్నెంట్ అని అనుకున్నారు. కానీ కాజల్ వాలకం చూస్తే అలా లేదు. సోషల్ మీడియాలో కాజల్ గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తే కాజల్ ప్రెగ్నెంట్ అంటారేమిటి.. అంత గ్లామర్ గా చక్కగా ఉంది. ప్రెగ్నెంట్ అయితే కాజల్ అలా ఎందుకు ఉంటుంది.. ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తుంది అని అంటున్నారు.
అసలు కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని దాచింది అని కొందరు అంటుంటే, అసలు కాజల్ ప్రెగ్నెంట్ కాదు, అందుకే కెరీర్ లో ఇంకా ఇంకా దూసుకుపోతుంది, ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోతే.. మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇలా గ్లామర్ షూట్స్ తో మరింతగా యాక్టీవ్ గా మారితే ఇంకా ఇంకా అవకాశాలు వస్తాయనే ఆశతో చేస్తుంది. అయితే కాజల్ ఇలా చెయ్యడంతో ఆమె అభిమానులే కన్ఫ్యూజ్ అవుతున్నారు.