కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో థియేటర్స్ లోకి దిగిన నాగ చైతన్య - సాయి పల్లవి కాంబో లవ్ స్టోరీ మూవీ ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు లవ్ స్టోరీ కి మేకర్స్, టీం చేసిన ప్రమోషన్ తో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలాగే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలు నడుమ గురువారం అర్ధరాత్రి నుండే ఓవర్సీస్ లో లవ్ స్టోరీ సందడి మొదలైపోయింది. సినిమాపై ఉన్న క్రేజ్ తో మూడు రోజులకు లవ్ స్టోరీ అడ్వాన్స్ బుకింగ్ జోరు సాగింది. ఓవర్సీస్ లో కరోనా లాక్ డౌన్ తర్వాత భారీ గా లవ్ స్టోరీ విడుదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ స్టోరీ పై భారీ క్రేజ్, అంచనాలు ఉన్నాయి.
ఓవర్సీస్ లో లవ్ స్టోరీని వీక్షించిన ప్రేక్షకులు తమ టాక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాగ చైతన్య పెరఫార్మెన్స్ పరంగా అదరగొట్టేసాడని, చివరి 30 నిమిషాలు సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాకు బలం, పవన్ సీహెచ్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది అని, సినిమా ఫాస్టాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరొకొందరు ప్రేక్షకులు.. సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది, మ్యూజిక్ అంతగా లేదు, నాగ చైతన్య - సాయి పల్లవి యాక్టింగ్ వేరే లెవల్ అంటున్నారు. ఇంకొందరు.. రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే.. ఈ సినిమాకి హీరో - హీరోయిన్ బలం అంటున్నారు. ఇక చైతూ కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్స్.. లవ్ స్టోరీ లోనే, సాయి పల్లవి ఎప్పటిలాగే నటన పరంగా రెచ్చిపోయింది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకుల సోషల్ మీడియా కామెంట్స్ ఉన్నాయి.