Advertisementt

టైమింగ్‌కు తగిన కథల్ని ఎంచుకోలేకపోయా

Thu 23rd Sep 2021 05:35 PM
srinu vaitla,dukudu movie,dhee movie,srinu vaitla latest interview movies  టైమింగ్‌కు తగిన కథల్ని ఎంచుకోలేకపోయా
Srinu Vaitla latest interview టైమింగ్‌కు తగిన కథల్ని ఎంచుకోలేకపోయా
Advertisement
Ads by CJ

ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలు చూసాక శ్రీను వైట్ల కామెడీకి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు, హీరోలు లేరు. కానీ శ్రీను వైట్ల మళ్ళీ దూకుడు లాంటి హిట్ కొట్టి పూర్వ వైభవం తెచ్చుకోవాలని పాకులాడుతున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల తో సినిమాలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రాకపోయినా.. ఢీ తో తన కెరీర్ కి లైఫ్ నిచ్చిన మంచి విష్ణు ఢీ అంటే ఢీ ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఢీ అంటే ఢీ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా.. కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. తాజాగా శ్రీను వైట్ల దూకుడు రిలీజ్ అయ్యి నేటికీ పదేళ్లు పూర్తి కావడంతో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలేడన్ని విషయాలను పంచుకున్నాడు. 

దూకుడు సినిమా తర్వాత కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిన నా నుండి దూకుడు ని మించి కామెడీ ఎక్సపెక్ట్ చెయ్యడం వలనే నాకు సరైన హిట్ దక్కలేదు. ప్రేక్షకులు నా మీద పెట్టుకున్న ఎక్సపెక్ట్షన్స్ కి రీచ్ అయ్యే కథలను ఎంపిక చేసుకోవడంలో తప్పటడుగు వేసాడు. అందుకే ప్లాప్స్ కొట్టాను. ఇక మీద అలాంటి తప్పు చెయ్యను, ట్రెండ్ కి తగిన కామెడీ పంచ్ లతో సినిమాలు చేస్తాను అని చెప్పాడు.  

ఇక మంచు విష్ణు తో చెయ్యాల్సియాన డి అండ్‌ డి సినిమా కరోనా వలనే లేట్ అయ్యింది. నవంబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమా మాత్రం ఢీ కి సీక్వెల్ కాదు.. ఆ ఫ్లేవర్ తో డి అండ్‌ డి ని తెరకేక్కిన్చబోతున్నట్లుగా శ్రీను వైట్ల ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Srinu Vaitla latest interview:

Srinu Vaitla latest interview movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ