Advertisementt

సిరిని అవాయిడ్ చేస్తున్న షణ్ముఖ్

Thu 23rd Sep 2021 03:53 PM
bigg boss 5,bigg boss 5 telugu,shanmukh,siri  సిరిని అవాయిడ్ చేస్తున్న షణ్ముఖ్
Bigg Boss5: Shanmukh avoiding Siri సిరిని అవాయిడ్ చేస్తున్న షణ్ముఖ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్రెండ్స్ గా అడుగుపెట్టిన సిరి హన్మంత్, షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ మీద రెండు వారాలుగా ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి లు సిరి, షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ గురించి నీచంగా మట్లాడారు. సిరి - షణ్ముఖ్ కలిసి బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారని, హౌస్ లో షణ్ముఖ్ సిరిని వదిలిస్తే, ఆమె మాట వినకుండా ఉంటే అతను కొన్నాళ్ళు హౌస్ లో ఉంటాడని ఉమాదేవి డైరెక్ట్ గానే అంది. అయితే తాజాగా షణ్ముఖ్ కూడా సిరి ఓవరేక్షన్ ని భరించలేకపోయాడేమో.. అందుకే సిరి బెడ్ పక్కన నుండి బెడ్ మార్చుకోవాలని ఆల్రెడీ రాత్రి జరిగిన ఎపిసోడ్ లోనే మరో కంటెస్టెంట్స్ తో అన్నాడు షణ్ముఖ్. ఇక తాజాగా స్టార్ మా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చెయ్యగా.. అందులో సిరి షణ్ముఖ్ చుట్టూనే తిరుగుతుంది. 

షణ్ముఖ్ చుట్టూ తిరుగుతూ సిరి అతనితో కాస్త ఫ్రెండ్ గా ట్రీట్ చెయ్యరా.. లేదు నాకు కొంచెం దూరంగా ఉండు అని షన్ను చెబుతాడు. అయినా సిరి షణ్ముఖ్ వెంటపడుతుంది. నేను నిన్ను గర్ల్ ఫ్రెండ్ గా చూడమనడం లేదు.. జస్ట్ ఫ్రెండ్ గానే చూడు అంటుంది. అంటే గర్ల్ ఫ్రెండ్ గా కాదు.. కనీసం ఫ్రెండ్ గా కూడా ట్రీట్ చెయ్యలేను అని షణ్ముఖ్ అనేసరికి సిరి ఫీలై ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. షణ్ముఖ్ సిరిని గర్ల్ ఫ్రెండ్ గా కాదు.. ఫ్రెండ్ గా కూడా వద్దు అంటూ షణ్ముఖ్ సిరిని అవాయిడ్ చేస్తున్నట్టుగా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో చూస్తే తెలుస్తుంది. చూద్దాం సిరి - షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ ఎటు దారి తీస్తుందో అనేది. 

Bigg Boss5: Shanmukh avoiding Siri:

Bigg Boss 5 latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ