Advertisementt

లవ్ స్టోరితో నటుడిగా నెక్ట్ లెవెల్ సంతృప్తి

Thu 23rd Sep 2021 03:13 PM
naga chaitanya,naga chaitanya interview,naga love story movie,naga chaitanya interview about love story  లవ్ స్టోరితో నటుడిగా నెక్ట్ లెవెల్ సంతృప్తి
Naga Chaitanya Interview లవ్ స్టోరితో నటుడిగా నెక్ట్ లెవెల్ సంతృప్తి
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. లవ్ స్టోరి ఈ శుక్రవారం

థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు. నాగ చైతన్య మాట్లాడుతూ...

- దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. శేఖర్ గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. రియలిస్టిక్ చిత్రాలంటే నాకు ఆసక్తి. మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికింది. లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందాను.

- లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చెప్పబోతున్నారు. జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నాము.

- దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు. ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.

- ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను. ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము. ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.

- శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది. కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను. తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.

- కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది. లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు. పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి. డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.

- ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం. సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు. తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

- మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం. దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.

naga chaitanya,naga chaitanya interview,naga love story movie,naga chaitanya interview about love storynaga chaitanya,naga chaitanya interview,naga love story movie,naga chaitanya interview about love storynaga chaitanya,naga chaitanya interview,naga love story movie,naga chaitanya interview about love storynaga chaitanya,naga chaitanya interview,naga love story movie,naga chaitanya interview about love storynaga chaitanya,naga chaitanya interview,naga love story movie,naga chaitanya interview about love story

Naga Chaitanya Interview:

Naga Chaitanya Interview about Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ