యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ జెమినీ ఛానల్ లో ఓ గేమ్ షో చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ మధ్యన విదేశాల నుండి ఓ కాస్ట్లీ కారుని తెప్పించుకున్నాడు. లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఊరుస్ కారును ఎన్టీఆర్ ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు. ఆ కార్ ఎన్టీఆర్ కొన్న కొత్తల్లో అది వచ్చిన కొత్తల్లో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఎన్టీఆర్ కారు గురించిన ముచ్చట్లే వినిపించాయి. ఆ కారు ఎలా ఉంటుంది. ఏ రేంజ్ స్పీడు వెళుతుంది. ఎలాంటి పరికరాలతో తయారు చేసారు.. అబ్బో ఆ కారు గురించే చర్చ.
అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ కారు మరోసారి వార్తల్లోకెక్కింది. అదేమిటంటే ఎన్టీఆర్ ఆ కారు నెంబర్ కోసం ఏకంగా 17 లక్షలు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్లు అన్నిటికి 9999 నంబర్ ఉంటుంది. సో ఇప్పుడు తన దగ్గరున్న లంబోర్ఘిని కారు నెంబర్ TS 09 FS 9999 కోసం ఎన్టీఆర్ 17 లక్షలు పెట్టాడంటే ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాదు.. మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మంగళ వారం TS 09 FS 9999 నెంబర్ ని ఎన్టీఆర్ యాక్షన్ లో 17 లక్షలకు దక్కించుకున్నాడన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ సెంటిమెంట్ విలువ అక్షరాలా 17 లక్షలు. ఎన్టీఆర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం గతంలో కూడా పది లక్షలు పెట్టి సొంతం చేసుకున్నాడు.