Advertisementt

ప్రభాస్ - పూజ మధ్యలో ఈగో: అదంతా..

Wed 22nd Sep 2021 11:22 PM
radhe shyam,prabhas,pooja,radhe shyam movie,prabhas and pooja  ప్రభాస్ - పూజ మధ్యలో ఈగో: అదంతా..
Rift Between Radhe Shyam Co-Stars Prabhas And Pooja ప్రభాస్ - పూజ మధ్యలో ఈగో: అదంతా..
Advertisement
Ads by CJ

ప్రభాస్ వరసగా పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా మారారు. వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ పై ఇప్పుడొక రూమర్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. అది ప్రభాస్ కి రాధేశ్యామ్ హీరోయిన్, టాప్ హీరోయిన్ పూజ హెగ్డే కి మధ్యన ఈగో క్లాష్ అయ్యింది. అందుకే రాధేశ్యామ్ సినిమాలోని చాలా సీన్స్ ని విడివిడిగా షూట్ చేసి గ్రాఫిక్స్ లో సెట్ చేసుకుంటున్నారని, ప్రభాస్ అసలు పూజ హెగ్డే తో కాంబో సీన్స్ చెయ్యడానికి కూడా ఇష్టపడలేదని, పూజ హెగ్డే యాటిట్యూడ్ కి రాధేశ్యామ్ టీం ఇబ్బంది పడింది అంటూ ఏవేవో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. 

టాప్ హీరోయిన్ అనే పొగరు, పాన్ ఇండియా లో ఉన్న క్రేజ్, బాలీవుడ్ లో బిజీ అవుతున్న కారణంగా పూజ హెగ్డే కాస్త యాటిట్యూడ్ చూపిస్తూ రూడ్ గా ఉంది అని, ప్రభాస్ కి పూజ తీరు నచ్చలేదని అబ్బో చాలానే న్యూస్ లు ప్రచారంలోకి వచ్చాయి. 

అయితే ఈ న్యూస్ లపై, రూమర్స్ పై రాధేశ్యామ్ టీం కాస్త లేటుగానే స్పందించింది. ప్రభాస్ - పూజ మధ్యలో ఎలాంటి క్లాష్ అవ్వలేదని, ప్రభాస్, పూజాహెగ్డేలకు పడట్లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ యూనిట్ స్పందించడమే కాదు.. అసలు ఈ సినిమాలో ప్రభాస్- పూజా హెగ్డేల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని అన్నారు. 

Rift Between Radhe Shyam Co-Stars Prabhas And Pooja:

All is not well between Radhe Shyam star Prabhas and Pooja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ