Advertisementt

7 గంటల పాటు ఈడీ ఆఫీస్ లో తరుణ్

Wed 22nd Sep 2021 07:59 PM
hero tarun,ed office,hyderabad,questioning,tollywood drugs case  7 గంటల పాటు ఈడీ ఆఫీస్ లో తరుణ్
Tarun Arrives At ED Office In Hyderabad 7 గంటల పాటు ఈడీ ఆఫీస్ లో తరుణ్
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మంది ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూన్నారు. పూరి జగన్నాధ్ దగ్గర నుండి నేడు విచారణలో పాల్గొన్న తరుణ్ వరకు ఈడీ విచారణకు హాజరయ్యారు. 12 మంది సెలబ్రిటీస్ ని కొన్ని గంటల పాటు ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ తో సెలబ్రిటీస్ కి ఉన్న సంబంధాలు, అలాగే మనీ లాండరింగ్ కేసు కాబట్టి, బ్యాంకు ఖాతాల పరిశీలన, ఎఫ్ క్లబ్ పార్టీ చుట్టూనే సెలెబ్రిటీ విచారణ సాగింది. 

తాజాగా హీరో తరుణ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు. తరుణ్ విచారణలో తరుణ్‌ బ్యాంక్ ఖాతాలను, అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. తరుణ్ కి కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి, ఎఫ్ క్లబ్ పార్టీ గురించి కూడా ఈడీ అధికారులు తరుణ్ ని ప్రశ్నించిన ట్టుగా తెలుస్తుంది. ఇక తరుణ్ తో ఈడీ అధికారులు దాదాపుగా 7 గంటల పాటు విచారణ జరిపారు. ఇప్పటివరకు ప్రశ్నించిన సెలబ్రిటీస్ నుండి ఈడీ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

Tarun Arrives At ED Office In Hyderabad :

Tarun Arrives At ED Office In Hyderabad For Questioning In Tollywood Drugs Case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ