Advertisementt

లైగర్ సెట్స్ లో నందమూరి నటసింహం

Wed 22nd Sep 2021 01:13 PM
balakrishna,akhanda movie,balayya visits the sets of liger movie,vijay deverakonda,pan india film liger,saala crossbreed,puri,charmi  లైగర్ సెట్స్ లో నందమూరి నటసింహం
Balakrishna Visits The Sets Of Vijay Deverakonda LIGER లైగర్ సెట్స్ లో నందమూరి నటసింహం
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబోలో పాన్ ఇండియన్ చిత్రం లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం లైగర్ మూవీ షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నారు. విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు చేస్తున్నారు. అక్కడ లైగర్ సెట్స్ లో జరిగే విషయాలను నిర్మాత ఛార్మి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి షేర్ చేస్తున్నారు.

ఇక తాజాగా లైగర్  షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ముఖ్య అతిథి సెట్‌లోకి అడుగుపెట్టారు. నటసింహ నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్‌కు వచ్చారు. గోవాకు దగ్గర్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో  లైగర్ సెట్‌లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ. లైగర్ సెట్‌ను చూసి యూనిట్‌ను అభినందించారు. సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్‌ మీద బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. లైగర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ టీంకు కంగ్రాట్స్ తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఇక అక్కడ లైగర్ సెట్స్ లో బాలకృష్ణ, ఛార్మి, విజయ్ దేవరకొండ, పూరి లతో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది  

మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ డ్రామా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ అనన్య పాండే ఈ చిత్రంలో  విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Balakrishna Visits The Sets Of Vijay Deverakonda LIGER :

Balakrishna Visits The Sets Of Vijay Deverakonda Pan India Film LIGER (Saala Crossbreed)

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ