Advertisementt

పుష్ప లో ఫహద్ కేరెక్టర్ రివీల్డ్

Wed 22nd Sep 2021 12:14 PM
pushpa movie,fahad fazil,allu arjun,sukumar,fahad to play forest officer  పుష్ప లో ఫహద్ కేరెక్టర్ రివీల్డ్
Fahad Fazil To Play Forest Officer in Pushpa Movie పుష్ప లో ఫహద్ కేరెక్టర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రిస్తున్నారు. అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా.. మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్.. గుండు, మెల్ల కన్ను తో డిఫ్రెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ మాస్ లుక్ లో పుష్ప రాజ్ గా విలన్ టైప్ లో కనిపిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ సినిమా లో ఫహద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని అన్నారు.

అయితే తాజాగా ఫహద్ ఫాజిల్.. ఫారెస్ట్ ఆఫీసర్ గా అది కూడా కరెప్టెడ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ మాస్ లుక్ కి, ఫహద్ ఫాజిల్ ఫారెస్ట్ ఆఫీసర్ లుక్ కి సెట్ అయ్యేలా యాక్షన్ సీక్వెన్సెస్ ని సుకుమార్ ప్లాన్ చేసాడట. ఆగష్టు నుండి పుష్ప షూటింగ్ లో ఫహద్ ఫాజిల్ నిర్విరామంగా పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా క్రిష్ట్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో విడుదల కాబోతుంది. 

Fahad Fazil To Play Forest Officer in Pushpa Movie:

Pushpa: Fahad Fazil To Play Forest Officer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ