Advertisementt

ఈ రోజు ఈడీ ఎదుట తరుణ్

Wed 22nd Sep 2021 10:09 AM
hero tarun,tarun at ed office,hyderabad  ఈ రోజు ఈడీ ఎదుట తరుణ్
Hero Tarun at ED Office ఈ రోజు ఈడీ ఎదుట తరుణ్
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ మొదటి వారం నుండి మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ లో 12 మంది సెలబ్రిటీస్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రానా దగ్గర నుండి రకుల్, పూరి, ఛార్మి, నందు, నవదీప్, తనీష్ ఇలా అందరూ ఈడి అధికారులు ముందు విచారణకు హాజరయ్యారు. ఇక మధ్యలో ఎక్సయిజ్ అధికారులు పూరి, తరుణ్ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ నమూనాలు లేవంటూ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఈ డ్రగ్స్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి - టీఆరెస్ కేటీఆర్ మధ్యన మాటల యుద్ధం జరగగా.. కేటీఆర్ రేవంత్ రెడ్డి పై పరువు ష్టం దావా వేసారు. 

ఇక ఈ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు చివరిగా హీరో తరుణ్ ఈడీ అధికారుల ముందు హాజరవుతున్నారు. ఈ విచారణలో తరుణ్ ని నవదీప్ తో సంబంధాలు, ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ విషయాలు, కెల్విన్ తో తరుణ్ కి ఉన్న సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఈ రోజు తరుణ్ చివరి వాడిగా ఈడీ ఎదుట హాజరవుతున్నారు.  

Hero Tarun at ED Office:

Hero Tarun at ED Office Hyderabad 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ