బిగ్ బాస్ రియాలిటీ షో లో బిగ్ బాస్ హౌస్ మొత్తం ప్రతి సోమవారం హీటెక్కిపోతుంది. సండే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే.. సోమవారం ఎవరు నామినేట్ చేస్తారో అని అందరిలో టెంక్షన్ ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఈ సోమవారం నామినేషన్స్ మొదలై మంగళ వారం వరకు కొనసాగింది. ప్రియా అనకూడని మాటలతో లహరిని, యాంకర్ రవిని హార్ట్ చేసింది. దానితో ప్రియా ని చాలామంది ఆ కారణంగానే నామినేట్ చేసారు. అలాగే హౌస్ లో ఎమోషన్స్, ఏడుపులుతో ఈ వారం నామినేషన్స్ కాస్త వేడిగానే సాగాయి.
ఈ వారం నామినేషన్స్ లో లహరి, ప్రియాంక, మానస్, శ్రీరాంచంద్ర, ప్రియ లు ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రియా బాగా రియలైజ్ అయ్యి.. నేను చూసిందే చెప్పాను, ఏమి కలిపించి చెప్పలేదు... అంటూ ఒంటరిగా బాధపడిన తర్వాత లహరి, రవికి సారీ చెప్పింది అంతేకాదు.. కెమెరా ముందుకొచ్చి రవి భార్య నిత్యని రవి ఫ్యామిలీ ని కూడా సారీ అడిగింది. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం అమెరికా అబ్బాయిగా శ్రీరామ చంద్ర.. ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా హమీద.. పెళ్లి కూతురుగా లహరిని ఎంపిక చేసి.. మిగతా కేరెక్టర్స్ లో అందరూ కలిసి కట్టుగా ఈ టాస్క్ కోసం రెడీ అయ్యారు.