ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ ఆ తర్వాత దర్శకుడిగా మారి.. టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి వెళ్లి అక్కడినుండి బాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రభుదేవా.. హిందీలో చేసిన సినిమాలు వరసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత పౌర్ణమితో ప్లాప్ కొట్టిన ప్రభుదేవా.. తర్వాత లేడి సూపర్ స్టార్ నయనతార తో ప్రేమాయణం నడిపి పెళ్లి దాకా వెళ్ళాక బ్రేకప్ చేసుకుని.. బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. అక్కడ స్టార్ హీరోలతో వరసగా సినిమాలు చేసాడు.
దర్శకుడిగా హిందీలో పలు సినిమాలు చేసిన ప్రభుదేవాకి సల్మాన్ ఖాన్ తో చేసిన దబాంగ్ 3, రాధే సినిమాలు వరసగా డిజాస్టర్స్ అవ్వడంతో ప్రభుదేవా ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేమిటంటే.. డైరెక్షన్ కి ఉండాలని. అంటే దర్శకుడిగా గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాడో.. లేదంటే దర్శకత్వానికి బై బై చెప్పేసి.. యాక్టర్ గా సెటిల్ అవుదామనుకుంటున్నాడో కానీ.. ప్రస్తుతందర్శకత్వం పక్కనపెట్టి యాక్టర్ గా బిజీ అవ్వాలని అనుకుంటున్నాడట. ప్రభుదేవా రీసెంట్ గా నటించిన భగీరా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది.