Advertisementt

ఎనిమికి డబ్బింగ్ చెబుతున్న విశాల్

Tue 21st Sep 2021 05:21 PM
action hero vishal,vishal,starts dubbing,enemy movie  ఎనిమికి డబ్బింగ్ చెబుతున్న విశాల్
Vishal Starts Dubbing For Enemy ఎనిమికి డబ్బింగ్ చెబుతున్న విశాల్
Advertisement
Ads by CJ

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి `ఎనిమి` సినిమాతో ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. `ఎనిమి` సినిమా విశాల్‌కు 30వ సినిమా కాగా ఆర్యకు 32వ సినిమా.

ప్రస్తుతం ఈ  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో విశాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. తెలుగులో విశాల్ డబ్బింగ్ చెబుతున్నట్టు ఒక‌ వీడియో ద్వారా తెలిపారు. తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టైల్లో కనిపిస్తున్నారు.

గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాలిని రవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఎనిమి టీజర్ ఎంతటి ఆదరణను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఆ టీజర్‌ను బట్టి చూస్తే.. ఇందులో హై యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.

Vishal Starts Dubbing For Enemy:

Action Hero Vishal Starts Dubbing For Enemy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ