Advertisementt

ఎన్టీఆర్ షో: కొరటాల, జక్కనల హంగామా

Tue 21st Sep 2021 11:47 AM
ss rajamouli,koratala siva,guests,ntr,evaru meelo kotiswarulu show  ఎన్టీఆర్ షో: కొరటాల, జక్కనల హంగామా
SS Rajamouli, Koratala Siva to appear as guests on NTR Show ఎన్టీఆర్ షో: కొరటాల, జక్కనల హంగామా
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి, ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ లు ఎన్టీఆర్ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు కి గత రాత్రి అంటే సోమవారం రాత్రి గెస్ట్ లు గా వెళ్లిన సంగతి తెలిసిందే. టాప్ డైరెక్టర్స్ తో స్టార్ హీరో గేమ్ షో అంటే.. విపరీతమైన క్యూరియాసిటీ బుల్లితెర ప్రేక్షకుల్లో ఉంది. ప్రోమో తోనే ఎవరు మీలో కోటీశ్వరులు షో పై అటెంక్షన్ క్రియేట్ చేసిన జెమినీ ఛానల్ సోమవారం పూర్తి ఎపిసోడ్ తో అంచనాలకు మించి ఆకట్టుకునేలా చేసారు. కొరటాల - రాజమౌళి ఇద్దరూ రావడం రావడమే ఎన్టీఆర్ ని ఆడుకున్నారు. కానీ ఎన్టీఆర్ హాట్ సీట్ లో అడిగిన ప్రశ్నలకు మాత్రం సీరియస్ గా సమాధానాలు చెప్పారు ఇద్దరు డైరెక్టర్స్. 

ఈ షో లో రాజమౌళి, కొరటాల శివలు ఏకంగా 25 లక్షల ప్రైజ్ మని గెలుచుకున్నారు. గంటసేపు షో లో ఆద్యంతం జక్కన్న, కొరటాల ఆకట్టుకునేలా హంగామా చేసారు. ఎన్టీఆర్ తో వారికున్న అనుబంధం, అన్ని ఈ షో కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక 7 ప్రశ్నలకు టకాటకా సమాధానము చెప్పిన కొరటాల, రాజమౌళి లు 8 వ ప్రశ్న దగ్గర 50:50 లైఫ్ లైన్ వాడారు. 10 వ ప్రశ్న దగ్గర మరో లైఫ్ లైన్ తీసుకున్న కొరటాల, రాజమౌళి లు శోభు యార్లగడ్డ కు వీడియో కాల్ చేసి ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్నారు. 12 ప్రశ్నలు పూర్తవడంతో రాత్రి ఎపిసోడ్ ముగిసింది. అక్కడికి రాజమౌళి, కొరటాల ఇద్దరు కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు షో లో 25 లక్షలు గెలుచుకున్నారు. 

SS Rajamouli, Koratala Siva to appear as guests on NTR Show:

SS Rajamouli, Koratala Siva to appear as guests on NTR Evaru Meelo Kotiswarulu Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ