Advertisementt

బేబమ్మకి క్యూట్ బర్త్ డే విషెస్

Tue 21st Sep 2021 10:37 AM
krithi shetty,krithi shetty birthday special,uppena beauty,rapo19,sudheer babu aa ammayi,nithin movie,bangarraju movie  బేబమ్మకి క్యూట్ బర్త్ డే విషెస్
Krithi Shetty Birthday Special బేబమ్మకి క్యూట్ బర్త్ డే విషెస్
Advertisement
Ads by CJ

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి.. ఆ సినిమా హిట్ తర్వాత అందరి నోట్లో బేబమ్మ గానే ఫిక్స్ అయ్యింది. క్యూట్ గా, పెరఫార్మెన్స్ పరంగాను ఉప్పెన సినిమాలో అదరగొట్టేసింది. కృతి శెట్టి కి ఆ సినిమా రిలీజ్ కాకూండానే నాని సినిమా ఆఫర్ దక్కింది. శ్యామ్ సింగ రాయ్ లో ఛాన్స్ పట్టేసిన కృతి శెట్టి కి రామ్ పోతినేని తాను తెలుగు, తమిళ భాషల్లో లింగు స్వామి దర్శకత్వంలో చెయ్యబోయే RAPO19 లో ఛాన్స్ ఇచ్చాడు. 

అంతేకాకుండా సుధీర్ బాబు తో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుంది. మరో యంగ్ హీరో నితిన్ సరసన ఓ మూవీ లో నటిస్తుంది. ఈ మధ్యనే ఆ మూవీ అఫీషియల్ గా మొదలైంది. ఇక నాగార్జున బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యకి జోడిగా ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి చేతిలో ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలున్నాయి. ఉప్పెన మూవీ తర్వాత కృతి శెట్టి కెరీర్ ఏ రేంజ్ లో ఉందొ ఈ సినిమాలే ఉదాహరణ. ఈ రోజు కృతి శెట్టి బర్త్ డే సందర్భంగా బేబమ్మ కి తాను నటిస్తున్న సినిమాల నుండి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ వదిలారు.. ఆయా సినిమా యూనిట్స్ వారు. మరి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బేబమ్మ కృతి శెట్టి కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.. 

Krithi Shetty Birthday Special :

Krithi Shetty Birthday Special article

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ