Advertisementt

బిగ్ బాస్ 5: ప్రియా మరీ పచ్చిగా

Sat 02nd Oct 2021 09:20 AM
bigg boss 5,bigg boss 5 telugu,bigg boss,nagarjuna,priya  బిగ్ బాస్ 5: ప్రియా మరీ పచ్చిగా
Bigg Boss 5: Monday Episode Highlights బిగ్ బాస్ 5: ప్రియా మరీ పచ్చిగా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో సోమవారం ఎలిమినేషన్స్ కోసం చేసే నామినేషన్స్ యుద్ధం అనేది ఎప్పుడు హాట్ గానే ఉంటుంది. వారం అంతా కలిసి తిరిగినవారు.. వారిని నామినేట్ చేస్తే అస్సలు డైజెస్ట్ చేసుకోలేరు. ప్రస్తుతం బిగ్ బాస్ 5 లో సీనియర్ నటి ప్రియా పరిస్థితి అలానే ఉంది. ఇద్దరు ముగ్గురు నామినేట్ చేసేసరికి సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ ఎదుటి కంటెస్టెంట్ ని మాటలతో రెచ్చగొట్టింది. గత రాత్రి నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా లహరి ప్రియాని నామినేట్ చెయ్యగా.. ప్రియా కూడా లహరిని నామినేట్ చేస్తూ చెత్త రీజన్ చెప్పింది. లహరి బిగ్ బాస్ హౌస్ లో ఉండే అందరి అబ్బాయిలతో బిజీగా ఉంటుంది అని, రవి తో మిడ్ నైట్ టైట్ హాగ్ ఇచ్చింది అని, అది కూడా రెస్ట్ రూమ్ లో అని, మానస్ ఇలా అందరు అబ్బాయిలతో లహరి బిజీగా ఉంటుంది అని అందుకే నామినేట్ చేస్తున్నా అంది. 

దానితో రవి, సన్ని, మానస్ లు అలా అంటారేమిటి హాగ్ ఇవ్వకూడదా.. ఇక్కడ రూల్ ఉందా.. మా ప్యామిలీస్ ఇలాంటి మాటలు వింటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ గొడవ పెట్టుకున్నాడు. ఇక లహరి కూడా ప్రియా మీద మాటల యుద్ధం చేసింది. రవి ఎందుకు అలా హౌస్ లో ఉన్నవారి సపోర్ట్ తీసుకోవడానికి, సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ ప్రియా కూడా తగ్గలేదు. ఇక రవి నాకు సిరి సిస్టర్ తో సమానం, లహరి కూడా అంతే అన్నాడు. లహరి రవి బర్త్ డే కాబట్టి నేను షర్ట్ పంపమని చెప్పాను. అది కూడా రవి బ్రో అని అడిగాను అంటూ ప్రియా తో ఫైట్ కి దిగగా.. రాత్రి హౌస్ మొత్తం గరం గరం గా మారిపోయింది. ఇక ఈ రోజు మంగళ వారం కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియని కొనసాగించారు బిగ్ బాస్ యాజమాన్యం. 

Bigg Boss 5: Monday Episode Highlights:

Bigg Boss 5: Yesterday Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ