Advertisementt

ఫైనల్లీ కార్తీక దీపం మోనిత జైల్లో

Mon 20th Sep 2021 10:05 PM
karthika deepam,karthika deepam serial,karthik,deepa,monitha  ఫైనల్లీ కార్తీక దీపం మోనిత జైల్లో
Karthika Deepam Serial Monitha goes to jail ఫైనల్లీ కార్తీక దీపం మోనిత జైల్లో
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్లుగా కార్తీక దీపం సీరియల్ లో మోనిత విలనిజం చూసిన బుల్లితెర ప్రేక్షకులకి కడుపు మండిపోతుంది. డాక్టర్ బాబు కార్తీక్ ని వంటలక్క దీపని పదేళ్ళపాటు విడదీసిన మోనిత చివరికి కార్తీక్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఎంతకైనా దిగజారడానికి రెడీ అయ్యింది. కార్తీక్ ద్వారా బిడ్డను కనాలని అడ్డదారిలో వెళ్లి.. చివరికి కార్తీక్ కి నిజం తెలిసిపోవడంతో హత్యా నాటకం ఆడిన మోనిత.. కార్తీక్ ని జైల్లో పెట్టి దీపని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంది. 

కానీ దీప మోనిత ని పట్టుకుని భర్త కార్తీక్ ని కాపాడుకుంది. అయితే కోర్టులో మోనిత కార్తీక్ అంటే ఇష్టం. అతని బిడ్డకి తాను తల్లినవుతున్నాను కాబట్టి.. కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను అని అడ్డంగా వాదించడంతో.. ఏ పాపం ఎరగని కార్తీక్ ని దీపని ఇబ్బందులు పాలు చేసిన మోనితకి ఐదు లక్షల జరిమానా.. 18 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. మోనిత ఫైనల్లీ జైలుకి వెళ్లడంతో బుల్లితెర ప్రేక్షకులు చాలా హ్యాపీ గా ఉన్నారు. కానీ మోనిత ఇది క్లైమాక్స్ కాదు.. జస్ట్ ఇంటర్మీషన్ మాత్రమే.. క్లైమాక్స్ చూస్తే గజగజ వణికిపోతారు.. జస్ట్ వెయిట్ అండ్ సి అనుకుంటూ వెళ్ళింది. మరి నెక్స్ట్ ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో కార్తీక దీపం సీరియల్ లో.. ఇప్పుడు మాత్రం మోనితాని జైలుకి పంపడం ప్రేక్షకులకి బాగా నచ్చింది. 

Karthika Deepam Serial Monitha goes to jail:

Karthika Deepam Serial today episode highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ