Advertisementt

సమంత ఎంత పెద్ద క్లారిటీ ఇచ్చింది

Mon 20th Sep 2021 09:34 PM
samantha,tweet,nagarjuna,anr lives on,naga chaitanya  సమంత ఎంత పెద్ద క్లారిటీ ఇచ్చింది
What a Big clarity Samantha gave సమంత ఎంత పెద్ద క్లారిటీ ఇచ్చింది
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా నాగ చైతన్య - సమంత లు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. సమంత చేసే పనులను లింక్ పెట్టి చైతు - సామ్ ల విడాకుల మేటర్ ని చిలవలు పలవలుగా చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై చైతు కానీ, సమంత కానీ ఎక్కడా స్పందించకుండా మాకెందుకు అన్నట్టుగా ఉంటున్నారు. ఇక నాగ్ బర్త్ డే కి విష్ చేసిన సమంత.. తర్వాత ఆ ఇంట్లో జరిగిన పార్టీలో కనిపించలేదు. లవ్ స్టోరీ ట్రైలర్ అప్పుడు చైతు ని టాగ్ చెయ్యకుండా టీం ని పొగిడినందుకు.. అప్పుడొక రూమర్. చైతు థాంక్స్ సామ్ అని స్పందించినా ఎవ్వరూ ఒప్పుకోలేదు.. 

ఇక ఈ రోజు నాగార్జున తన తండ్రి  అక్కినేని నాగేశ్వర రావు జయంతి రోజున ఆయనకిష్టమైన పంచె కట్టుతో ఓ వీడియో చేసాడు. ANRLivesOn అంటూ చేసిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు నాగ్. ఆ వీడియో చూసిన సమంత This is so beautiful @iamnagarjuna mama #ANRLivesOn.. అని నాగ్ ని మామా అంటూ ట్వీట్ చెయ్యడంతో చైతు కి సమంతకి ఎలాంటి గొడవలు లేవు.. కావాలనే సోషల్ మీడియాలో పుకార్లు రేపుతున్నారు. చైతు తో విడిపోయేది అయితే నాగ్ ని మామా అని సమంత సంభోదించదు అంటూ అక్కినేని అభిమానులు గాసిప్ రాయుళ్ల మీద వేసుకుంటున్నారు. 

What a Big clarity Samantha gave:

Samantha tweet about Nagarjuna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ