సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోను సూద్.. రియల్ లైఫ్ లో మాత్రం హీరోలా మారాడు. కరోనా కష్టకాలంలో సోను సూద్ పేదల పాలిట పెన్నిదిలా మారాడు. అలాంటి రియల్ హీరోపై ఐటి దాడులు జరగడం ఆయన అభిమానులకి ఆగ్రహం తెప్పించింది. గత నాలుగు రోజులుగా సోను సూద్ ఇంటిపై ఆయన ఆఫీస్ పై జరుగుతన్న దాడులను ఐటి అధికారులు అప్ డేట్ ఇస్తున్నారు. అందులో సోను సూద్ ఓ 20 కోట్ల పన్ను ఎగవేసాడంటూ సంచలన ప్రకటన చేసారు.తాజగా సోను సూద్ తనపై జరిగిన ఐటి దాడుల విషయమై స్పందించాడు. తాను ఏ విషయమైనా స్పందించాల్సిన అవసరం లేదని.. అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది అని ట్వీట్ చేసాడు సోను .
ఇండియా ప్రజలకి సహాయం చెయ్యాలని ప్రతిజ్ఞ పూనాను. ప్రజలకి ఏ కష్టం వచ్చినా తాను ఆదుకుంటాను అని, నేను యాడ్స్ చేస్తునందుకు వచ్చిన ప్రతి పైసా పేదల సహాయం కోసమే ఉపయోగిస్తాను అని, గత కొన్ని రోజులుగా పర్సనల్ పనులతో బిజీగా ఉండడంతో తాను ఈ విషయమై స్పందించలేదు అని.. ఎవ్వరు ఏమనుకున్నా తానూ మాత్రం తనకు యాడ్స్ మీద వచ్చే ప్రతి రూపాయి పేదల కోసమే అని చెప్పాడు. ఇక మళ్ళీ నా సేవలు యదాతదం అంటూ ట్వీట్ చేసాడు.