బిగ్ బాస్ సీజన్ 5 లో గ్లామర్ మిస్సింగ్ అని బుల్లితెర ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. ఎవరు చూసినా ముదురు లేడీస్ తప్ప.. అందమైన గ్లామర్ గర్ల్ అంటూ ఎవరూ లేరు. సిరి కాస్త గ్లామర్ గా ఉన్నా.. ఆమె ఓవరేక్షన్ ని చూసి బుల్లితెర ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. షణ్ముఖ్ తో కలిసి ఆడేసి గెలిచేద్దామని చూస్తుంది. ఇక మరో అమ్మాయి హమీద.. మెల్లిగా తానేమిటో ప్రూవ్ చేసుకోవడానికి తనకి జోడి వెతుక్కుంటుంది. కెమెరా ముందు ఫోకస్ అవ్వడానికి నానా తంటాలు పడుతుంది. దాని కోసం గ్లామర్ డ్రెస్ లు వేస్తుంది. గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తుంది.
కానీ ఆమెకి ఆ గ్లామర్ లుక్ రావడం లేదు. చిట్టి పొట్టి డ్రెస్ వేసి.. స్లీవ్ లెస్ బ్లోస్ లు వేసి, మిడ్డీ లు వేసినా.. ఆమె ఫేస్ లో ఆకర్షణ ఉండాలి. హమీద ఎవరికీ తెలియదు. ఆమె ఎంతగా గ్లామర్ గా రెడీ అయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. శ్రీరామ్ తో లవ్ ట్రాక్ వేసి ఫెమస్ అవుదామనుకుంటుంది. ఇక శని, ఆదివారం ఎపిసోడ్స్ లో గ్లామర్ గా కనిపించింది కానీ.. ఆమెలో ఆకర్షణ మిస్ అయ్యింది. అంతగా తెలియని ఫేస్, అందం ఉన్న ఆకర్షణ లేదు. ఇవన్నీ ఆమె ఎంతగా గ్లామర్ షో చేసినా.. హైలెట్ అవ్వడం లేదు. మరి పోను పోను ఎమన్నా హమీదా అందరికి కనెక్ట్ అవుతుందేమో చూద్దాం.