గత సోమవారం నామినేషన్స్ లో ఉన్న ఉమాదేవి, యాని, హమీద, కాజల్, లోబో, నటరాజ్ మాస్టర్, ప్రియా లలో నటరాజ్, కాజల్, లోబో, హమీద, ప్రియా, యాని మాస్టర్ అందరూ సేవ్ అవ్వగా.. ఈ రోజు ఆదివారం సెకండ్ ఎలిమినేషన్స్ లో ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది. ముందు నుండి ఊహించినట్టుగానే హౌస్ లో కాస్త భూతులు మాట్లాడుతూ.. రెచ్చిపోయి నేను ఇలానే ఉంటా అంటూ రెబల్ లా మారిన ఉమాదేవిని ప్రేక్షకులు బయటికి పంపేశారు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుండి నాగ్ తో బిగ్ బాస్ స్టేజ్ పై నించునున్న ఈ రోజు ఎలిమినేటర్ ఉమాదేవి.. సిరి ని షణ్ముఖ్ ని కలిసి ఆడుకుంది. సిరి నువ్వు స్ట్రాంగ్ కానీ.. షణ్ముఖ్ తో కలిసి గెలనుకుంటున్నావ్, ఇక షణ్ముఖ్ నువ్వు నీలా ఉండు, ఫ్రెండ్ షిప్ కోసం ఉండకు అన్న ఉమాదేవి లోబోని మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. ఉమాదేవి హౌస్ లో కాస్త గొడవలు పడినా.. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరిని ఏం అనకుండా, ఎవరిని దులపకుండా స్టేజ్ దిగి వెళ్లిపోవడమే హాట్ టాపిక్ అయ్యింది.