నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ అవలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలని అనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది.
సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. లవ్ స్టోరి సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్. అన్నారు.