మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఆదివారం సాయంత్రం పార్క్ హయాత్ లో చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకేక్కించిన లవ్ స్టోరీ మూవీ అన్ ప్లగ్డ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో లవ్ స్టోరీ టీం ని స్పెషల్ గా అభినందించిన చిరు.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సీఎం లపై కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమా ఇండస్ట్రీలో కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమాలు చెయ్యాలంటే భయంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. రెండు రాష్ట్రల సీఎం లు ఇండస్ట్రీ సమస్యలపై చొరవ తీసుకోవాలి.
సినిమా ఇండస్ట్రీలో ఎవరు అధిక పారితోషకాలు తీసుకోవడం లేదు. కేవలం నలుగురైదుగురు మాత్రమే అధిక పారితోషకాలు తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మా సినిమా పరిశ్రమల బాధలని ఇద్దరు సీఎం లు పట్టించుకోవాలి.. అంటూ చిరు సంచలనంగా మాట్లాడారు. ఇక ఈ ఈవెంట్ కి చిరు తో పాటుగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.