ఈమధ్యన లేడీ సూపర్ స్టార్ నయనతార లవర్ విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ వార్తలొచ్చినా నయనతార కానీ విగ్నేష్ కానీ ఈ విషయమై ఎక్కడా స్పందించలేదు. ఇక పెళ్లి చేసుకోకుండా ఎప్పటినుండో కలిసి ఉంటున్న నయనతార - విగ్నేష్ లు తాము పార్టీ చేసుకున్నా, లేదా వెకేషన్స్ కి బయటికి వెళ్లినా ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. నయనతార పుట్టిన రోజు వేడుకలు, నయనతార అమ్మ కురియన్ బర్త్ డే వేడుకలు, విగ్నేష్ బర్త్ డే వేడుకలు ఇలా ఏ అకేషన్ అయినా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా విఘ్నేశ్ 36వ పుట్టినరోజు న నయనతార స్పెషల్ పార్టీ ఇచ్చింది. దీంతో ప్రియురాలు నయన్ కి విఘ్నేశ్ థ్యాంక్స్ చెప్పాడు.
అయితే తాజాగా విగ్నేష్ శివన్ - నయనతార పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంతుందో కానీ.. నయన్ - విగ్నేష్ ల పెళ్లి మాత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ప్రముఖ చర్చలో జరగబోతుందని తెలుస్తోంది. కొద్దిమంది సన్నహితుల మధ్యనే పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లుగా సమాచారం. మరి నయన్ పెళ్లి డేట్ పై జరుగుతన్న ప్రచారం నిజం కావాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు.