సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా ఫ్రెండ్లీ గానే ఉంటారు. కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఫైటింగ్, ఫ్లెక్సీ లు చింపుకోవడాలు, పోస్టర్స్ మీద బురదలు చళ్ళు కోవడాలు అంటూ గోల గోల చేస్తుంటారు. కానీ హీరోలు మాత్రం ఎంతో స్నేహంగా ఉంటారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఎంతో మంచి ఫ్రెండ్స్, రామ్ చరణ్ - మహేష్, మహేష్ - ఎన్టీఆర్, అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ఇలా అందరూ ఫ్రెండ్లీ గానే ఉంటారు. ఒకళ్ళ సినిమా ఫంక్షన్ కి మరొకరు వెళ్తారు.. అభినందిస్తారు. కానీ ఫాన్స్ మాత్రమే ఒప్పుకోరు. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్నారు. అందులో ఒకరి పాత్ర తక్కువ ఉండి, మరొకరి పాత్ర ఎక్కువ ఉన్నా బయట ఫాన్స్ మధ్యన యుద్ధాలే జరుగుతాయి.
అయితే తాజాగా ఎన్టీఆర్ కోసం మహేష్ రాబోతున్నాడట. ఎందుకంటే ఎన్టీఆర్ - కొరటాల తో చెయ్యబోయే NTR30 ఓపెనింగ్ కోసం మహేష్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడట. మహేష్ కి కొరటాలతో ఇటు ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది..కొరటాలతో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ కూడా చేసాడు. ఇక ఎన్టీఆర్ తో మంచి స్నేహం అనుబంధం ఉంది. సో అలా మహేష్ ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 కి ఓపెనింగ్ కోసం స్పెషల్ గెస్ట్ గా కాబోతున్నాడట