Advertisementt

లవ్ స్టోరీ స్పెషల్ గెస్ట్ గా బాలీవుడ్ హీరో

Sun 19th Sep 2021 02:47 PM
megastar chiranjeevi,bollywood,aamir khan,attending,lovestory event  లవ్ స్టోరీ స్పెషల్ గెస్ట్ గా బాలీవుడ్ హీరో
Chiranjeevi and Bollywood star Aamir Khan will be attending LOVESTORY Event లవ్ స్టోరీ స్పెషల్ గెస్ట్ గా బాలీవుడ్ హీరో
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ వచ్చే శుక్రవారమే.. రిలీజ్ కి రెడీ అయ్యింది. సెకండ్ వేవ్ కి ముందే రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ ఎట్టకేలకు థియేటర్స్ లో దిగబోతుంది. అయితే సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న, అయిన సినిమాల్లోకెల్లా లవ్ స్టోరీ మూవీపై భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే లవ్ స్టోరీ మూవీ టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. మల్టిప్లెక్స్ లో నాగ చైతన్య లవ్ స్టోరీ కి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ రావడం తో మేకర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. 

ఇక ఈ రోజు జరగబోయే లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరు స్పెషల్ గెస్ట్ గా హాజరవుతుంటే. నాగార్జున కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీలో నాగ చైతన్య స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్న అమీర్ ఖాన్ చైతు తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇక ఈ రోజు పార్క్ హయాత్ లో జరగబోయే లవ్ స్టోరీ ఈవెంట్ కి అమీర్ ఖాన్ స్పెషల్ అప్పీరియన్స్ కాబోతున్నారు. 

Chiranjeevi and Bollywood star Aamir Khan will be attending LOVESTORY Event:

Megastar Chiranjeevi  and Bollywood star Aamir Khan will be attending LOVESTORY Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ