Advertisementt

మొక్కలు నాటిన అమీర్ ఖాన్ అండ్ చైతు

Sun 19th Sep 2021 02:35 PM
amir khan,naga chaitanya,participated,green india challenge  మొక్కలు నాటిన అమీర్ ఖాన్ అండ్ చైతు
Amir Khan along with Naga Chaitanya participated in Green India Challenge మొక్కలు నాటిన అమీర్ ఖాన్ అండ్ చైతు
Advertisement
Ads by CJ

కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవ్వాల బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ ను చేరింది.

ఇవ్వాల హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ టర్క్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం అప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

amir khan,naga chaitanya,participated,green india challengeamir khan,naga chaitanya,participated,green india challengeamir khan,naga chaitanya,participated,green india challengeamir khan,naga chaitanya,participated,green india challengeamir khan,naga chaitanya,participated,green india challenge

Amir Khan along with Naga Chaitanya participated in Green India Challenge:

Amir Khan along with Naga Chaitanya participated in Green India Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ