Advertisementt

ఎన్టీఆర్ తప్పు చేసాడేమో?

Sun 19th Sep 2021 10:55 AM
young tiger ntr,ntr,evaru meelo koteeswarudu show  ఎన్టీఆర్ తప్పు చేసాడేమో?
Did NTR make a mistake? ఎన్టీఆర్ తప్పు చేసాడేమో?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ కి స్టార్ హీరో. హీరోగా ఎన్టీఆర్ కి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ తో అడుగుపెట్టబోతున్నాడు. ఆ తర్వాత కూడా కొరటాల శివ, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీస్ నే లైన్ లో పెట్టాడు. ఇక తాజాగా బుల్లితెర మీద ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఫాన్స్ ని, బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో తో జెమినీ ఛానల్ కి కాస్త టీఆర్పీ రావడం వరకు ఓకె. ఎన్టీఆర్ స్టయిల్, ఎన్టీఆర్ ఎదుటి వారితో మాట్లాడడం అన్ని ఆకట్టుకుంటున్నాయి.

మద్యమద్యలో కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ రేపో.. తన ఫాన్స్ తో ఎన్టీఆర్ నడుచుకునే తీరు  కంటెస్టెంట్స్ కి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం చూపించినప్పుడు ఎన్టీఆర్ రియాక్షన్, ఆయన లుక్స్, ఎన్టీఆర్ స్టయిల్ అన్ని అదుర్స్ అనేలా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా వచ్చి తప్పు చేసాడేమో అనే ఫీలింగ్ లో ఫాన్స్  బిగ్ బాస్ అంత క్రేజ్ ఎవరు మీలో కోటీశ్వరులకు ఉండడం లేదు. షో, ప్రశ్నలు, ఎన్టీఆర్ హోస్ట్  కానీ అలాంటి షోస్ కి బుల్లితెర ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ కాలేకపోతున్నారు.

అదే బిగ్ బాస్ లో గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, అలకలు ఇవన్నీ తొందరగా ప్రేక్షకులకి ఎక్కుతాయి. కానీ ఎవరు మీలో కోటీశ్వరులు చూసే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. అందునా.. పల్లెటూరి ప్రేక్షకులకి. అందుకే ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గానే  సల్మాన్ రేంజ్లో క్రేజ్ వచ్చేసేది అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. 

Did NTR make a mistake?:

Ntr Evaru Meelo Koteeswarudu Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ